Prabhas | డార్లింగ్ ప్రభాస్‌కి మనదేశంలోనే కాక విదేశాలలోను ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనని ఈ మధ్య వరుస సక్సెస్‌లు పలకరించడంతో క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఉన్నాయి. ది రాజా సాబ్ మరో రెండు నెలల్లో విడుదల కాబోతుంది. ఫౌజీ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా త్వరలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` మూవీ ప్రారంభించనున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. కొందరి దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.
మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా, గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో మంచు విష్ణు మాట్లాడుతూ.. నా దృష్టిలో ప్రభాస్ సాధారణ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ, మోహన్‌లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసింది. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన్ను లెజెండ్‌ను చేస్తాయి అంటూ విష్ణు కామెంట్ చేశారు.
విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. డార్లింగ్ లెజెండ్ కాదు అని అలా ఎలా అంటారు అని విష్ణుపై ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా `కన్నప్ప`లో ప్రభాస్ పాత్ర సుమారు 20 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ కోసమే కన్నప్పని చూసేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం జూన్‌లో తప్పక రిలీజ్ అవుతుందని నెటిజన్స్ , సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.
#Prabhas is a normal actor for me#Mohanlal is a Legend
– Manchu Vishnu https://t.co/ttMz9lmK5F pic.twitter.com/mn2kPt1zob— Nag Mama Rocks (@SravanPk4) April 24, 2025