MAA Elections | మా అసోసియేషన్ ఎన్నికల్లో వేడి ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు బండ్ల గణేశ్ ప్యానల్ మార్చడంతో రచ్చ మరింత పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు ప్రకాశ్‌రాజ్‌కు జై కొట్టిన బండ్ల.. ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాడు. జీవిత రాజశేఖర్‌ను ప్యానల్లోకి తీసుకోవడంపై ప్రకాశ్ రాజ్‌ను తప్పుపట్టాడు బండ్ల గణేశ్. ఆమెకు వ్యతిరేకంగా జనరల్ సెక్రెటరీ పోస్టుకు నిలబడి గెలుస్తానంటూ సవాల్ చేశాడు. ఇదిలా ఉంటే ముందు నుంచి పంచముఖ పోటీగా ఉన్న మా ఎన్నికలను చివరికి ఇద్దరి మధ్య యుద్ధంగా మార్చేశారు సినీ పెద్దలు. మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ గా ఈ పోటీ ఉండబోతోంది.
జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహ రావు పోటీ నుంచి తప్పుకున్నారు. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్లుగానే ఎన్నికల బరిలో అధ్యక్షుడిగా మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ పోటీ జరగబోతుంది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొందరు పెద్దల సపోర్టు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంచు విష్ణు కూడా ఈసారి అధ్యక్షుడు హోదా కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటి నుంచో మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అందరూ తంటాలు పడుతున్నారు.. అయితే ఈసారి విష్ణు మాత్రం తన సొంత ఖర్చుతో బిల్డింగ్ కడతాను అంటూ హామీ ఇచ్చాడు. దానికోసం స్థలం కూడా చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ, కృష్ణంరాజు మరికొందరు సినీ పెద్దలు మంచు విష్ణుకు అండగా నిలుస్తున్నారు. కచ్చితంగా ఈ పోటీ రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు మోహన్ బాబు తనయుడు.. మరొకవైపు చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్న ప్రకాశ్‌రాజ్ పోటీలో ఉండడంతో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయావకాశాలు ఎక్కువగా మంచు విష్ణుకు ఉన్నాయని తెలుస్తుంది. అక్టోబర్‌లో మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
MAA: ఆ పదవిని నేను నిర్వర్తించలేను, న్యాయం చేయలేను: బండ్ల గణేష్
lahari shari | ఇంతకీ లహరి షారి ఎవరు.. బిగ్ బాస్‌కు ఎలా వచ్చింది..?
ఆ షాట్ తర్వాత బాగా ఏడ్చేశా.. ఎమోషన్ అయిన రాశీ ఖన్నా