మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘జిన్నా’. సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్ నాయికలుగా నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. తాజాగా సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ లుక్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నది. దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి మూలకథ అందించిన ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : ఛోటా కె నాయుడు.