మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘జిన్నా’. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ నాయికలుగా నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తుది సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ..‘అభిమానుల కోసమే ఈ సినిమా చేశాను. ఇది నా మనసుకు దగ్గరైన సినిమా. ఇందులో ఎన్నో విశేషాలున్నాయి. నా కంటే ముందు ఈ సినిమాకి ఎంపికైంది సన్నీ లియోన్. ఆమెను మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉంది. నా పిల్లలు అరియానా విరియానా పాట పాడటం నాకెంతో సంతోషాన్నిచ్చింది’ అన్నారు. ‘వినోద ప్రధానంగా కథలు రాయడం నాకు అలవాటు.
మంచు విష్ణుతో ‘ఢీ’, ‘దేనికైనా రెఢీ’ చిత్రాలు చేశాను. అవి రెండు మంచి విజయాలు సాధించాయి. ‘జిన్నా’ వాటికంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’ అని రచయిత కోన వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, దర్శకుడు ఇషాన్ సూర్య ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.