Kannappa | టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa)తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కన్నప్పలో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తోపాటు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంది.
తాజాగా విష్ణు ప్రభాస్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ (Prabhas) కన్నప్ప టీంతో జాయిన్ అవడం గురించి సమాచారం ఇచ్చినప్పుడు ట్విట్టర్ (ఇండియా) ఎంటర్టైన్మెంట్ విభాగంలో ట్రెండింగ్‌లో ఉంది. కన్నప్ప సినిమాకు సూపర్ స్టార్లు ఉన్నారు. కథలో సాలిడ్ పాత్రలు ఉన్నాయి.. ఆ పాత్రలను టాప్ స్టార్ యాక్టర్లు పోషించాలని కోరుకున్నాను. ఓ పాత్ర కోసం ప్రభాస్‌ను సంప్రదించాను. నేరేషన్ విన్న తర్వాత ప్రభాస్ మరో పాత్రపై ఆసక్తి కనబరిచి.. అవకాశం ఉంటే ఆ రోల్ చేస్తానని చెప్పాడు. ప్రభాస్ అభిప్రాయం మేరకు ఆ పాత్రను డెవలప్ చేశామన్నాడు.
ప్రభాస్ ఆ పాత్రను చాలా ఇష్టపడ్డాడు. ఇక సినిమాలోని పాత్రలను పరిచయం చేసేవరకు ఎవరెవరు ఏఏ రోల్స్‌లో కనిపించబోతున్నారనేది చెప్తామని.. అప్పుడే ఎలాంటి అంచనాలకు రావొద్దని సూచించాడు విష్ణు. అప్పటివరకు ఎలాంటి అపోహలకు తావివ్వొద్దు.. ఎవరినీ నమ్మొద్దు. సిల్వర్ స్క్రీన్‌పై కన్నప్ప కథను తీసుకొచ్చేందుకు చాలా ఎక్జయిటింగ్ ఉన్నట్టు చెప్పాడు. సోమవారం ఉదయం అందరికీ అద్భుతమైన వార్త ఒకటి చెప్పబోతున్నట్టు తెలిపాడు.