మంచు మనోజ్ కథానాయకుడిగా ‘రక్షక్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ కొల్లి దర్శకుడు. శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై సినిమా రూపొందుతున్నది. మంగళవారం మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా పవర్ఫుల్ లుక్‌తో మనోజ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు.
పోస్టర్‌పై కనిపిస్తున్న The hidden truth is never hidden forever (దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు) అనే ట్యాగ్‌లైన్ కథలోని మిస్టరీని సూచిస్తున్నది. ఇందులో ఆవేశపరుడైన పోలీస్ పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నారని, ఆయన కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ ఇదే అవుతుందని, థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు. మంచు మనోజ్ నటించిన ‘భైరవం’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ‘మిరాయి’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.