Manchu Lakshmi | మోహన్‌బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మంచు లక్ష్మీ. కెరీర్ బిగెనింగ్‌లో పలు హాలీవుడ్ షార్ట్‌ఫిలింస్‌లో నటించిన మంచు లక్ష్మీ ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఐరేంద్రిగా ప్రతినాయకురాలి పాత్ర పోషించి గొప్ప ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘దొంగలముఠా’, ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’ వంటి పలు సినిమాల్లో నటించింది. నటీగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘అగ్ని నక్షత్రం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
తాజాగా మంచులక్ష్మీ మహా శివరాత్రి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఆది శంకరాచార్యులు రచించిన ‘నిర్వాణ శటకం’ శ్లోకాన్ని మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ఆలపించారు. వారణాసిలోని పవిత్ర ఘాట్ల దగ్గర ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట మంచులక్ష్మీకి శివునిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. పలురకాల వేశాధారణలో మంచులక్ష్మీ ఈ సాంగ్‌లో కనిపించింది. కన్నూ సమీర్ స్వరపరిచిన ఈ పాటలో ఇంగ్లీష్ సాహిత్యం కూడా ఉంది. ముఖ్యంగా వంశీ కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వారణాసిని కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ పాటతో ఎప్పుడూ మంచు లక్ష్మీని ట్రోల్ చేసే వారు కూడా తెగ పొగిడేస్తున్నారు. అద్భుతంగా పాడావని, పాట చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్గా రిలీజైన ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.