Manchu Lakshmi | కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ ఆసక్తి వివాదాలతో వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో మంచు కుటుంబం విభేదాలు వీధికెక్కాయి. అయితే ఈ గొడవలపై మంచు లక్ష్మీ ఏ నాడు మాట్లాడింది లేదు. ఎవరికి సపోర్ట్ చేసింది లేదు. అయితే మంచు మనోజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో తన సోదరి మంచు లక్ష్మిని కలిశాడు. వేదికపైన ఉన్న అక్క మంచు లక్ష్మిని వెనుక నుండి వచ్చి సర్ప్రైజ్ చేశాడు. అయితే సడెన్‌గా మనోజ్‌ని అక్కడ చూసిన మంచు లక్ష్మీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబంలో జరుగుతున్న తగాదాల మధ్య మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మి చాలా ఎమోషనల్ అయింది.
ఆ సమయంలో మనోజ్ భార్య.. మోనికా మంచు లక్ష్మీని ఓదార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అయితే తాజాగా దానికి కారణం తెలియజేసింది. మంచు లక్షి జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరు కాగా, ఆ సమయంలో మంచు లక్ష్మి మనోజ్ ని పట్టుకొని ఏడ్చిన వీడియోని ప్లే చేసి దాని గురించి అడిగారు. దానిపై స్పందించిన మంచు లక్ష్మీ…నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ లేరు. నా లైఫ్ లో మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. సడెన్ గా వాడ్ని అక్కడ చూసేసరికి ఆనందంతో చాలా ఎమోషనల్ అయ్యాను. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ మెయిన్ అంటూ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడింది మంచు లక్ష్మీ. ఇంకా మనోజ్ గురించి, ఫ్యామిలీ గొడవల గురించి మంచు లక్ష్మీ ఏమైన మాట్లాడిందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
మంచు లక్ష్మీ ఈ మధ్య పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనస్సులు గెలుచుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించాలన్న లక్ష్యంతో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు మంచు లక్ష్మీ. ఈ సంస్థ తెలంగాణలో అనేక పాఠశాలలను దత్తత తీసుకుని వారికి మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది.