సిరి ఎమోషనల్ జర్నీ వీడియోలో సిరి ప్రియుడు వచ్చి ఎమోషనల్ అయిన బిట్‌ని హైలైట్ చేశారు. ‘సిరి వదిలేస్తున్నావా? బయట ఒకడున్నాడే నీకోసం.. అర్ధం చేసుకోగలను.. నేను నీతో ఉన్నా..’ అని శ్రీహాన్ చెప్పిన మాటల్ని మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది సిరి. అయితే వీడియో కంప్లీట్ అయిన తరువాత షణ్ముఖ్‌కి థాంక్స్ చెప్పిన సిరి.. బిగ్ బాస్‌కి కిస్ ఇచ్చి ఐ లవ్యూ చెప్పేసింది.
మీకు నచ్చిన ఫోటోని తీసుకోవాలని బిగ్ బాస్ ఆదేశించడంతో సిరి ..షణ్ముఖ్ ఉన్న పిక్స్ తీసుకుంది. హౌజ్‌లోకి వెళ్లాక షణ్ముఖ్ఖి టైట్ హగ్ ఇచ్చి తన జర్నీ విషయాలను పంచుకుంది. ‘తండ్రిలేని పిల్లవని.. నేను అడ్వాంటేజ్ తీసుకోలేదని మీ మమ్మీతో చెప్పు అన్నావ్ కదా.. అది వచ్చిందని షణ్ముఖ్‌తో చెప్పి మురిసిపోయింది సిరి. షణ్నుతో కలిసి డ్యాన్స్ చేసిన ఫొటో కూడా పట్టుకొచ్చి డైనింగ్ టేబుల్‌పై దాచిపెట్టింది.
బిగ్‌బాస్ అక్కడున్న సెట్‌నంతా తొలగించే క్రమంలో ఆ ఫొటోను కూడా మాయం చేయడంతో సిరి నిరాశపడింది. జర్నీ వీడియోలో మనిద్దరం కంటెంట్ ఇవ్వడానికే వచ్చాం అని మానస్ అన్నాడంటూ షణ్నుకు చెప్పింది సిరి. దీంతో ఆగ్రహించిన షణ్ను. అందుకే నేను అవకాశం ఇవ్వను.. నువ్వు ఎందుకు ఇస్తున్నావో నాకు అర్ధం కాదు అని సిరితో మానస్ గురించి గుసగుసలాడాడు షణ్ముఖ్.