అగ్ర హీరో చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొని ఉంది. ‘మీసాల పిల్ల’ ‘శశిరేఖ’ వంటి పాటలు మిలియన్లకుపైగా వ్యూస్‌తో సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాయి. ఈ సినిమాలో మరో అగ్ర నటుడు వెంకటేశ్ కీలమైన అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ కలిసి స్టెప్పులేసిన పబ్‌సాంగ్ కూడా ప్రమోషన్లో హైలైట్‌గా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శుక్రవారం మేకర్స్ ఆ శుభవార్తను వెల్లడించారు. ఈ నెల 4న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పవర్ఫుల్ స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చేతిలో తుపాకీ పట్టుకొని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా కలబోసిన చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని మేకర్స్ తెలిపారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్‌స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందకురానున్న విషయం తెలిసిందే.