Mana Shankara Vara Prasad Garu Second single | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ (MSG) చిత్రం నుంచి తాజాగా రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘మీసాల పిల్ల’ భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం తదుపరి పాట అప్డేట్తో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ‘శశిరేఖ’ (Sasirekha) అనే పేరుతో వచ్చిన ఈ రెండో పాట ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్ సీసిరిలియో సంగీతం అందించాడు.
ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా వంటి అగ్ర తారలు నటించారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.