Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చాటిచెప్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మెగా మాస్ ర్యాంపేజ్‌ను చూపిస్తోంది. మొదటి రోజే రూ.84 కోట్ల భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించి రూ.120 కోట్ల మార్కును దాటేసింది. దీంతో చిరంజీవి కెరీర్లో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన ఆరో చిత్రంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ మెగాస్టార్ మ్యాజిక్ రిపీట్ అయ్యింది. అమెరికాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద పట్టు చాటుకుంది. మరీ ముఖ్యంగా చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను ఈ సినిమా కేవలం 48 గంటల్లోనే అధిగమించడం విశేషం.
ఈ భారీ విజయానికి ప్రధాన కారణం అనిల్ రావిపూడి చిరంజీవిని ఆయన మార్క్ వింటేజ్ కామెడీ టైమింగ్‌తో, పాత సినిమాల ఎనర్జీతో వెండితెరపై ఆవిష్కరించడమేనని చెప్పవచ్చు. దీనికి తోడు విక్టరీ వెంకటేష్ (వెంకీ గౌడ) చేసిన 20 నిమిషాల అతిథి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడటం అభిమానులకు కన్నుల పండువగా మారింది. కామెడీ, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ సరైన పాళ్లలో ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బుక్‌మై షోలో ప్రతి గంటకు సుమారు 24 వేల టికెట్లు అమ్ముడవుతుండటం ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన స్పందన పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఇంతకంటే గొప్ప సంక్రాంతి కానుక ఉండదని పేర్కొన్నారు. నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Mega Star Chiranjeevi is setting box office on fire. #ManaShankaraVaraPrasadGaru has raked in over ₹120 crores worldwide in just 2 days, making Sankranthi a global box office festival. The film’s phenomenal success is driven by strong family turnout, positive word of mouth, and… pic.twitter.com/d8ukYJxmQW
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2026