Mammootty in College Syllabus | మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. మమ్ముట్టి సినీ జీవితంను కేరళలోని ఒక కాలేజీ పాఠ్యాంశంగా చేర్చింది. కేరళలోని ఎర్నాకుళంలో ఉన్న చారిత్రక మహారాజాస్ కాలేజీ తన B.A. ఆనర్స్ (నాలుగేళ్ల) కోర్సును సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మలయాళ సినీ దిగ్గజం మమ్ముట్టితో పాటు, ప్రముఖ సామాజిక సంస్కర్త దక్షాయణి వేలాయుధన్, అలాగే నిరాశ్రయులైన మహిళల కోసం కృషి చేసిన తపస్విని అమ్మ వంటి అనేక మంది ప్రముఖుల జీవితాలు, వారి కృషిని పాఠ్యాంశాలుగా చేర్చింది. కొత్తగా చేసిన ఈ మార్పులు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రాబోతున్నాయి.
B.A. ఆనర్స్ రెండవ సంవత్సరం విద్యార్థులకు “హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా” (మలయాళ సినిమా చరిత్ర) పేరిట ఈ సిలబస్‌ను భోధించనున్నారు. అయితే కాలేజీ తీసుకున్న ఈ నిర్ణయంపై మమ్ముట్టి తన ఆనందం వ్యక్తం చేశాడు. నా సినీ ప్రస్థానంపై పాఠ్యాంశం వస్తున్నందుకు నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఇది నా కెరీర్లో ఒక అద్భుతమైన మైలురాయి” అని పేర్కొన్నారు.