టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ప్రస్తుతం సురేందర్ రెడ్డి (Surender Reddy) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ఏజెంట్ (Agent). హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అఖిల్ స్టన్నింగ్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ నటిస్తున్నాడు మమ్ముట్టి. ఏజెంట్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఏజెంట్ కొత్త షెడ్యూల్ ఇవాళ షురూ కాగా…మమ్ముట్టి తాజా షూట్లో జాయిన్ అయ్యాడు.
దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సాక్షి వైద్య ఈ ప్రాజెక్టులో అఖిల్‌కు జోడీగా నటిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథనందించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్-సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిఝా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రగుల్ హెరియన్ ధరుమన్ కెమెరా వర్క్ చేస్తుండగా..నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్.
A Stalwart of Indian Cinema who paved his own path with Discipline & Dedication 🔥@mammukka Joins the shoot of #AGENT ⚡️
Can’t wait to witness the magic on sets @AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @VamsiVakkantham@hiphoptamizha @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/1PlXbUXrGo
— BA Raju's Team (@baraju_SuperHit) March 7, 2022
అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. చేతిలో గన్, తలపై బ్లాక్ క్యాప్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాడు మమ్ముట్టి. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో తొలిసారి బ్రేక్ అందుకున్నాడు అఖిల్. ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలనే కసితో ఉండగా..ఏజెంట్ బాక్సాపీస్ వద్ద ఎలా ఫలితం చూపిస్తాడో చూడాలి మరి.