సినిమా హీరోయిన్లకు లవ్ ప్రపోజల్స్ రావడం సహజం. మరీ ఈ సోషల్ మీడియా యుగంలో అయితే ఈ ప్రపోజల్స్ వేలల్లోనే ఉంటాయి. ఇలాంటి వాటిని అలా చూసి, ఇలా వదిలేస్తుంటారు మన కథానాయికలు. తాజాగా మలయాళ మందారం మమితాబైజు.. తనకొస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడింది. ‘ ‘ప్రేమలు’ తర్వాత నాకు ఈ ప్రపోజల్స్ ఎక్కువైపోయాయి. కొందరైతే ఫోన్ నంబర్ తెలుసుకొని డైరెక్ట్‌గా ఫోన్‌కే పెట్టేస్తున్నారు. ప్రస్తుతానికి వీటిని చదివే టైమ్, ఓపిక నాకు లేదు.
అందుకే ఈ వ్యవహారాలన్నింటినీ మా అన్నయ్యే చూసుకుంటూ ఉంటాడు. తను రాష్ట్రస్థాయి క్రికెట్ ప్లేయర్. పేరు మిథున్. మేం అన్నాచెల్లెళ్లమే అయినా.. క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. నాకు సంబంధించిన ప్రతి విషయంలో మా అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అభిమానుల నుంచి నాకొచ్చే కామెంట్లకు ఆయనే బదులిస్తుంటాడు. కామెంట్‌ని బట్టి రిైప్లె ఉంటుందన్నమాట. నేను తీసుకునే ఏ నిర్ణయమైనా అన్నయ్యను అడిగే తీసుకుంటాను. చివరకు నా పెళ్లి కూడా అన్నయ్యే డిసైడ్ చేస్తాడు.’ అని చెప్పుకొచ్చింది మమితా బైజు.