Sreeleela | తమిళ అగ్ర హీరో విజయ్ తన చివరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తున్నది. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందనున్నదని చెన్నై సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు ప్రధాన భూమిక పోషిస్తున్నది. తెలుగులో శ్రీలీల చేసిన పాత్రనే తమిళంలో మమితా బైజు పోషిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినిపిస్తున్న వార్తలు కూడా దానికి బలాన్నిస్తున్నాయి. బాలయ్య సినిమాలో శ్రీలీల తన నటనతో ఆకట్టుకున్నది. యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టేసింది. మరి మమితా ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి విజయ్, పూజా, మమితా కాంబో ఆడియన్స్‌కి ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.