కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు.. వెలుగులో ఉన్న కథానాయికలపైనే రూమర్లు.. ఇది ఎవరైనా ఒప్పకోవాల్సిందే. ప్రస్తుతం మలయాళ మందారం మమితాబైజు ఇలాంటి పుకార్లనే ఎదుర్కొంటున్నారు. ‘ప్రేమలు’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా అవతరించిన మమితా.. రీసెంట్గా ‘డ్యూడ్’తో మరో విజయాన్ని అందుకున్నారు. దీంతో యువ కథానాయికల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారామె. ‘డ్యూడ్’ సినిమాకు ఆమె పారితోషికంగా 15 కోట్లు తీసుకున్నట్టు బాలీవుడ్లో కథనాలు వెలువడ్డాయి.
అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసిన ఈ వార్తపై రీసెంట్గా మమితా స్పందించింది. ‘నేను సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండను. రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఈ లింక్‌ని నాకు పంపారు. మీలాగే నేనూ ఆశ్చర్యపోయా. అంత రెమ్యునరేషన్ తీసుకునేంత హీరోయిన్ని కాదు నేను. ఇలాంటి వార్తలు చూస్తే.. నిజంగా నేను అంత డిమాండ్ చేస్తున్నానేమోనని నాకోసం వచ్చే వాళ్లు కూడా రారు. ఇది నా కెరీర్‌కే దెబ్బ. ప్లీజ్.. ఇలాంటివి నమ్మొద్దు.’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మిమితా బైజు