Nayakudu Movie On Ott | పోయిన వారం అసలెలాంటి అంచనాల్లేకుండా రిలీజైంది నాయకుడు సినిమా. ఈ మధ్య కాలంలో భారీగా ప్రమోషన్లు చేసిన సినిమాలే ఓపెనింగ్స్ లో తడబడుతున్నాయి. అలాంటిది అసలు ప్రమోషన్లు చేయకుండా సినిమా రిలీజ్ చేయడం అంటే రిస్క్ అని చెప్పాలి. ప్రస్తుతం నాయకుడు సినిమా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఏషియన్, సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద సంస్థలు పంపిణీ చేసినా కేవలం ప్రమోషన్లు చేయకపోవడం వల్లే ఈ సినిమాకు పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. అలా అని ఈ సినిమానేం తీసిపాడేయలేం. రెండు వారాల కింద తమిళంలో రిలీజై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కొంచె లాగ్ ఉందని రివ్యూలు వచ్చినా.. తమిళ తంబీలు ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను తెగ ఆదరిస్తున్నారు. తెలుగులో కాస్త ప్రమోషన్లు చేసి ఉంటే ఈ సినిమా కనీసం మంచి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. ఇప్పటివరకు ఈ సినిమా కనీసం కోటీ రూపాయల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేదని ఇన్ సైడ్ టాక్.
ఇక ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా ఈ సినిమా ఓటీటీలో రావడానికి ముస్తాబయింది. ఇదే నెల 27న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అంటే రెండు వారాలు తిరక్కుండానే నాయకుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ తెరకెక్కించాడు. దశాబ్దాలుగా మనకు సుపరిచితుడైన వడివేలు కీలకపాత్రలో నటించాడు. బల్వర్ సింగ్ షేకావత్ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇలా రెండు వారాల్లోపే సినిమాను స్ట్రీమింగ్ చేయడంతో ఇంత దానికి మాతో టిక్కెట్లు కొనిపించడం ఎందుకని పలువురు సినీ లవర్స్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars🤩#Maamannan, coming to Netflix on the 27th of July!🍿#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID
— Netflix India South (@Netflix_INSouth) July 18, 2023