Malvi Malhotra | తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమూ? అని అడగాల్సిన పన్లేదు. మల్లెలు ఎవరి కోసం కాస్తాయి? చుక్కలు ఎవరికోసం పూస్తాయి?.. ‘తిరగబడరా సామీ’ కథానాయిక మల్వీ మల్హోత్రా ముస్తాబూ అందుకే! తెలుగువాళ్ల టేస్ట్ బాగా స్టడీ చేశాకే.. అమ్మడు శంషాబాద్‌లో విమానం దిగినట్టుంది. కాబట్టే, ఏరికోరి సీక్వెన్స్ వీవ్ పద్ధతిలో రూపుదిద్దుకున్న ఆర్గంజా క్రీమ్‌కలర్ కాటన్ చీరతో ముస్తాబై వచ్చింది.
స్ట్రైప్స్‌తో ఆ నేతకు మరింత హుందాతనం చేకూరింది. తెల్లరంగు స్లీవ్‌లెస్ జాకెట్ అతికినట్టు సరిపోయింది.. ఆ మేని ఛాయకు.