Malli Pelli | టాలీవుడ్ యాక్టర్ నరేశ్ (Naresh), పవిత్రాలోకేశ్ (Pavitra Lokesh) కాంబోలో వస్తున్న చిత్రం మళ్లీ పెళ్లి (Malli Pelli). తెలుగు-కన్నడ బైలింగ్యువల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మళ్లీ పెళ్లి ట్రైలర్ (Malli Pelli Trailer) లాంఛ్ చేశారు మేకర్స్. ట్రైలర్ నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమ వ్యవహారం, పెళ్లి టాపిక్తోపాటు నరేశ్‌కు అతని మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య జరిగే కాంట్రవర్సీల నేపథ్యంలో సాగుతూ క్యూరియాసిటీని పెంచుతోంది.
ట్రైలర్ చూస్తుంటే కొన్నాళ్లుగా నరేశ్ రియల్‌లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలను డైరెక్టర్ ఎంఎస్ రాజు మూవీలో ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నరేశ్ హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో సహజనటి జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎన్ బాల్‌రెడ్డి కెమెరామెన్.
మళ్లీ పెళ్లి చిత్రానికి సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నరేశ్, పవిత్రాలోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే టైటిల్‌తో సినిమా చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. మళ్లీ పెళ్లి మే 26న థియేటర్లలో సందడి చేయనుంది.
మళ్లీ పెళ్లి ట్రైలర్..
Everything is Fair in Love & War ❤️🔥
Unvieling the Madness of Love with #MattheMaduve Trailer 💥
– https://t.co/NLIExkLoTe🌟ing @ItsActorNaresh & #PavitraLokesh
Written & Directed by @MSRajuOfficial@vanithavijayku1 @sureshbobbili9 @VKMovies_ @ArulDevofficial @EditorJunaid pic.twitter.com/hBmsEhArvZ
— MS Raju (@MSRajuOfficial) May 11, 2023
మళ్లీ పెళ్లి ఫస్ట్ లుక్..
మళ్లీ పెళ్లి టీజర్ ..