Malikappuram Movie On OTT | సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయ. తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ మలయాళ సినిమాలు. హంగులకు, ఆర్భాటలకు పోకుండా సింపుల్‌గా సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఒకప్పుడు అసలు మలయాళ సినిమాలను లెక్కచేయని టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఇప్పుడు వెతికి మరీ చూస్తున్నారు. గతేడాది వచ్చిన భీమ్లానాయక్, గాడ్‌ఫాదర్ సినిమాలు మలయాళ రీమేక్‌లే. ఇక ఇదిలా ఉంటే గతేడాది చివర్లో మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది మాలికాపురం అనే చిత్రం. పట్టుమని 5కోట్లు కూడా బడ్జెట్ కాలేదు. కానీ మలయాళంలో వంద కోట్ల కలెక్షన్లు సాధించి ఒక్కసారిగా సెన్సేషన్ అయింది.
కంటెంట్ నచ్చి అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. అయితే ఇక్కడ అంతగా ఆడలేదు. దానికి ముఖ్య కారణం రిలీజ్ టైమ్. అప్పటికి సంక్రాంతి సినిమాల జోరు ఊపు మీదుంది. పైగా అసలు ఈ సినిమా రిలీజవుతున్న విషయమే చాలా మందికి తెలియదు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా సంక్రాంతి నెక్స్ట్ వీక్ రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా తెలుగులో 50లక్షలు కూడా సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 15నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే షన్ను అనే పాపకి శబరిమలై వెళ్లాలని కోరిక ఉంటుంది. షన్ను కోరికను తన తీరుస్తానని అని మాటిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల శబరిమలైకు తీసుకెళ్లలేకపోతాడు. మరీ ఆ సంఘటన ఏంటీ. ఇంతకీ షన్ను శబరిమలై వెళ్లిందా? వెళ్తే ఎవరు తీసుకెళ్లారు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సింపుల్ స్టోరీ లైన్‌లానే అనిపించినా దర్శకుడు విష్ణు తెరపై ఆవిష్కరించిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేం. జనతా గ్యారేజ్, యశోద వంటి సినిమాల్లో కీలకపాత్రల్లో మెప్పించిన ఉన్నీ ముకుందన్ ఈ సినిమాలో ప్రధాన హీరోగా నటించాడు.