దేశంలోని పేరెన్నికగన్న మహానటుల జాబితాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కచ్ఛితంగా ఉంటారు. 47ఏండ్ల సినీ ప్రస్థానం ఆయనది. దాదాపు 400 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారాయన. మోహన్‌లాల్‌లోని మరోకోణం సేవాగుణం. ‘విశ్వశాంతి ఫౌండేషన్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి, చిల్డ్సన్స్ హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఆర్ధికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన పిల్లలకు సబ్సిడీ ధరలతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను ముమ్మరంగా చేయించిన ఘనత మోహన్‌లాల్‌ది.
దీంతోపాటు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు మోహన్‌లాల్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే ఆయనకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇంకో మూడేండ్లలో మోహన్‌లాల్ 50ఏండ్ల కెరీర్‌ని పూర్తి చేసుకోనున్నారు. ఈ ఘనతలన్నింటినీ పొందుపరుస్తూ.. మోహన్‌లాల్ జీవితంపై త్వరలో ఓ పుస్తకం రానుంది. ‘ముఖరాగం’ పేరుతో ప్రచురితమవుతున్న ఈ పుస్తకాన్ని కేరళకు చెందిన ఓ ప్రముఖ సాంస్కృతిక సంస్థ ప్రేక్షకులకు అందించనున్నది. త్వరలో రానున్న ఈ పుస్తకం కోసం కోట్లాది మంది మోహన్‌లాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.