న్యూఢిల్లీ, మార్చి 30: ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్పై ఏర్పడిన వివాదంపై మలయాళ సూపర్‌స్టార్, హీరో మోహన్‌లాల్ క్షమాపణ చెప్పారు. వివాదానికి కారణంగా భావిస్తున్న గుజరాత్ అల్లర్లను పోలి ఉన్న కొన్ని సీన్లను తొలగించడానికి తన చిత్ర బృందం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు మోహన్‌లాల్ ఫేస్బుక్ పోస్ట్‌ను నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ షేర్ చేశారు.
చిత్రంలో ఉన్న కొన్ని రాజకీయ-సామాజిక ఇతివృత్తాలు నా అభిమానులు చాలా మందిని నిరాశపరిచినట్టు తెలుసుకున్నా. నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, మతాన్ని, భావజాలాన్ని కించపర్చకుండా చూడటం నటుడిగా నా బాధ్యత. జరిగిన దానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతూ దృశ్యాలను తొలగిస్తున్నాం.’ అని మోహన్‌లాల్ పేర్కొన్నారు.