Mammootty | మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం కేరళలోని కొచ్చిలో ఆవిష్కృతమైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొచ్చిలోని ప్రసిద్ధ ఎర్నాకుళతప్పన్ ఆలయాన్ని సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు. ఆలయ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు తన చేతులతో భోజనం వడ్డించారు. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, హిందూ ఆలయ ఉత్సవాల్లో పాలుపంచుకుని సేవ చేయడం ద్వారా ఆయన కులమతాలకు అతీతంగా అందరి హృదయాలను గెలుచుకున్నారు. కేరళ సంస్కృతిలో కళాకారులు, సామాన్యులు ఐక్యంగా పండుగలను జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో కూడా మమ్ముట్టి ఆరోగ్యం కోసం ఆయన ప్రాణ మిత్రుడు మోహన్ లాల్ శబరిమల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భాలు మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రస్తుతం మమ్ముట్టి ఆలయంలో అన్నదానం చేసిన వార్త సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతుంది.
Religious Harmony in kerala🫶
Mammootty at Ernakulathappan temple serving Annadhaanam to devotees😇#Mammootty #ChathaPacha pic.twitter.com/GoFwvtfmd4— Btwits_Akash (@btwits_Akash_) January 27, 2026