Actor Ravi kumar | మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రవి కుమార్ (71) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చైన్నైలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికుమార్ కొడుకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రవికుమార్ మరణవార్తపై అటు మలయాళం ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు తమిళ సినీ ప్రముఖలు సంతాపం తెలుపుతున్నారు.
కేరళలోని త్రిసూర్‌కు చెందిన రవి కుమార్, 1975లో మలయాళం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘ఉల్లాస యాత్ర’, ‘అవరగళ్’, ‘సీబీఐ 5’, ‘పరమానందం’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తమిళంలో ‘అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు’, ‘రమణ’, ‘ఆనంద రాగం’ వంటి సినిమాల్లో నటించారు.