తెలుగులో బిజీ అవుతున్న ఒకప్పటి మలయాళ స్టార్ హీరో

కొన్నేళ్ల కింది వరకు కేవలం తమిళ నటులు మాత్రమే తెలుగులో ఎక్కువగా నటించే వాళ్లు. సత్య రాజ్, శరత్ కుమార్ సహా చాలా మంది తమిళ నటులు తెలుగులో పాగా వేశారు. మన దర్శకులు కూడా వాళ్లకే ఎక్కువగా అవకాశం ఇచ్చే వాళ్లు. కన్నడ, మలయాళ ఇండస్ట్రీల క్యారెక్టర్ ఆర్టిస్టులను తెచ్చుకోవడం చాలా తక్కువ. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతున్నాయి. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా మన దగ్గరికి నటులు వస్తున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలు కూడా తెలుగులో నటించారు.
ఇక ప్రస్తుతం సమంత హీరోయిన్గా వస్తున్న శాకుంతలం సినిమాలో దేవ్ మోహన్ అనే మలయాళ హీరో కథానాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఒక మలయాళ నటుడు ఈ మధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా బిజీ అవుతున్నాడు. ఆయన పేరు జయరామ్. కేరళలో ఈయనకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు జయరామ్‌కు తెలుగులో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. అనుష్క హీరోయిన్గా నటించిన భాగమతి సినిమాలో విలన్ గా నటించాడు జయరామ్. ఇదే తెలుగులో ఆయన తొలి సినిమా. ఇక గతేడాది అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో హీరో తండ్రి పాత్రలో కనిపించాడు జయరామ్.
ఈ పాత్రకు అంత సరిపోలేదు అంటూ మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా కూడా.. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యాక జయరామ్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో మంచి మార్కెట్ ఉంది. స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నాడు జయరామ్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా ఈయన కీలకపాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తున్నాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ఒక అమ్మాయిని ఇష్టపడ్డ ఆర్.నారాయణమూర్తి.. పెండ్లి చేసుకుందాం అనుకుంటే..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
ఏఎన్నార్ ను ముట్టుకుంటే చర్మం ఊడిపోయేది.. కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan kalyan | రికార్డు రేటుకు భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- jayram
- telugu cinema
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

