Kattalan | ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్యంతో సునీల్, ఆంటోనీ వర్గీస్ కొత్త మూవీ.. ‘కాటాలన్’ తెలుగు ట్రైలర్ విడుదల
Antony Varghese | మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాటాలన్’.
Antony Varghese | మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాటాలన్’. వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించే టాలీవుడ్ నటుడు సునీల్ మరియు టాలెంటెడ్ విలన్ కబీర్ దుహాన్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాల్ జార్జ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
అడవి నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్ అంతటా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు కనిపించాయి. ఏనుగు దంతాల అక్రమ రవాణా ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ఇందులో వచ్చే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఉంది. అలాగే ట్రైలర్లో వినిపించే ‘కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి’ అనే పవర్ఫుల్ డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లో మరొక ప్రత్యేకత ఏమిటంటే, యూట్యూబ్ సెట్టింగ్స్‌లో ఆడియో ట్రాక్‌ను మార్చుకోవడం ద్వారా మూడు రకాల విభిన్నమైన సౌండ్ వేరియేషన్లతో దీనిని వీక్షించే సాంకేతిక సదుపాయాన్ని కల్పించారు. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ఇటు మలయాళంలోనే కాకుండా అటు తెలుగులోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

