Prashanth Narayanan | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ నటుడు, పొలిటికల్ లీడర్ విజయకాంత్ మరణం ఈరోజు అందరిని షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షాక్ నుంచి తేరుకునే లోపే మరో షాక్ తగిలింది. ప్రముఖ మలయాళ థియేటర్ ఆర్టిస్ట్, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ (51) కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో అనారోగ్యం కారణంగా ప్రాణాలు విడిచారు. ఇక ప్రశాంత్ నారాయణన్ మరణ వార్తతో మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో చాయాముఖి (ChayaMukhi) అనే నాటకాన్ని వేసిన ప్రశాంత్ నారాయణన్.. రంగస్థలంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన నాటకాలకు తన రచనలను అందించారు. నాటకరంగంలో ఆయన చేసిన సేవలకు గాను.. ది సంగీత నాటకం అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.