తాను నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కాకముందే.. ఇక్కడి స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌ని సాధించారు మలయాళ భామ మాళవిక మోహనన్. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ మలయాళ మందారం ఇటీవల తన ఎక్స్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంలో ప్రభాస్ గురించి అభిమానులు అడగ్గా.. ‘ప్రభాస్‌తో పరిచయం కాకముందు పలు ఇంటర్వ్యూల్లో ఆయన్ను చూశా. ఆ మాట్లాడే తీరు చూసి.. తాను అంతర్ముఖుడేమో, ఎవరితో ఎక్కువగా మాట్లాడడేమో అనుకున్నా.
కానీ ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నిజానికి ఆయనంత సరదాగా ఎవరూ ఉండరు. ఆయన ఉంటే సెట్ అంతా కోలాహలమే. డల్ మూమెంట్ అనేది ఆయన దరిదాపుల్లో ఉండదు.’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక.
‘నేను సాధించాను.. అని మీకు అనిపించిన క్షణమేది? అని ఓ అభిమాని అడగ్గా.. ‘క్యూ లైన్లో వేచి ఉండకుండా డైరెక్ట్‌గా దేవాలయాల్లోకి అడుగుపెట్టిన క్షణంలో ఏదో సాధించాననే ఫీలింగ్.’ అని సమాధానమిచ్చింది మాళవిక. ‘ది రాజాసాబ్’ తర్వాత మీరు చేయబోయే తెలుగు సినిమా ఏది? అనడగ్గా.. ‘మీరే చెప్పండి?.. మీరు నన్ను ఏ హీరోకు జంటగా చూడాలనుకుంటున్నారు!? ’ అంటూ ఎదురు ప్రశ్నించి అందంగా నవ్వేసింది మాళవిక మోహనన్.