Malavika Mohanan | ‘పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాను. ఆ ఫీలింగే చెప్పలేని సంతోషాన్నిస్తోంది’ అంటూ సంబరపడిపోతున్నది అందాలభామ మాళవిక మోహనన్. ప్రభాస్, మారుతిల ‘రాజా సాబ్’ సినిమా ద్వారా మాళవిక టాలీవుడ్‌కి పరిచయమవుతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘రాజా సాబ్’ సినిమా గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది మాళవిక. ‘ప్రభాస్ పెక్యులర్ పర్సన్. సెట్లోకి వస్తూనే ఎనర్జీని తెస్తారు. పనిని భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అసలు పాన్ఇండియా సూపర్‌స్టార్ అన్న గర్వం ఆయనలో ఏ మాత్రం కనిపించదు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు.
ఆయన సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్బాస్టర్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్. తాజాగా ఈ మలయాళ మందారం.. విక్రమ్ ‘తంగలాన్’లో ఆరతి పాత్రలో తళుక్కున మెరిసింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులే సొంతం చేసుకుంది.