Malavika Mohanan | మలబార్ సోయగం మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తోన్న ఈ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని విధంగా.. మాళవిక కంప్లీట్ డీగ్లామరైజ్డ్ రోల్లో నటిస్తోంది. తంగలాన్ నుంచి మాళవికా మోహనన్ లుక్ (Thangalaan Look) విడుదల చేయగా.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
బ్రిటీష్ యాక్టర్ డానియల్ కల్టగిరోన్తో దిగిన ఫొటోను షేర్ చేసింది మాళవికా మోహనన్. చాలా నెలల తర్వాత లండన్‌లో డానియల్ కల్టగిరోన్ను కలవడం సూపర్ ఫన్‌గా ఉంది. మీరంతా ఫైనల్‌గా సినిమా చూడబోతుండటం చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది. అప్పటిదాకా వేచి ఉండలేకపోతున్నాం.. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడీ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
పా రంజిత్ దర్శకత్వంలో తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తంగలాన్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తంగలాన్ 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా విడుదల కాబోతుండగా.. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.మాళవిక మోహనన్ మరోవైపు తెలుగులో మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమాలో ఫీ మేల్ లీడ్రోల్లో నటిస్తోంది.
డానియల్‌తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..