Nayanatara | నటి మాళవికా మోహన్‌పై నయనతార ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మాళవికా తను నటించిన ‘క్రిస్టీ’ ప్రమోషన్లో భాగంగా లేడి సూపర్‌స్టార్ ట్యాగ్‌పై చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. తనకు లేడీ సూపర్‌స్టార్ ట్యాగ్ అంటే ఇష్టం ఉండదని, హీరోయిన్లను కూడా హీరోల మాదిరిగానే సూపర్‌స్టార్ అంటూ అభివర్ణించాలని మాళవికా చేసిన వ్యాఖ్యలపై నయన్ అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. మళవికాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాగా తాజాగా వీటిపై మాళవికా మోహన్ స్పందించింది.
నటీమణులందరినీ ఉద్దేశిస్తూ ఆ పదాన్ని ఉపయోగించి నా అభిప్రాయాన్ని బయటపెట్టాను. అంతేకానీ, కచ్చితంగా ఒక్క హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపింది. అంతేకాకుండా తనకు నయనతార అంటే ఎంతో గౌరవం అని, తనని సీనియర్‌గా భావిస్తానని.. దయచేసి మీరందరూ శాంతించండి అంటూ తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చింది. గతంలోనూ నయనతారను ఉద్దేశిస్తూ, మాళవికా మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అప్పుడు కూడా నయన్ ఫ్యాన్స్ మాళవికాను తీవ్రంగా ట్రోల్ చేశారు. అయితే మధ్యలో నయన్ స్పందించడంతో ఆ గొడవ సద్దుమణిగింది.