బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన అపార్ట్మెంట్ టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అనిల్ అరోరా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పుణేలో ఉన్న మలైకా అరోరా తండ్రి మరణవార్త తెలియగానే ముంబయికి చేరుకుంది. ఆమె మాజీ భర్త నటుడు అర్భాజ్ ఖాన్ కూడా అనిల్ అరోరా నివాసానికి వచ్చారు. మలైకా అరోరాకు 11 ఏండ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి మలైకా, ఆమెఓ సోదరి అమృత తల్లి వద్దే పెరిగారు. అయితే మలైకా సినీరంగంలోకి అడుగుపెట్టిన తర్వాత తండ్రితో కలిసి చాలా సందర్భాల్లో కనిపించింది. అనిల్ అరోరా మర్చెంట్ నేవీలో పనిచేశారు.