Makeup Man Movie | శ్రీకాంత్ అవుటూరి హీరోగా పరిచయమవుతున్న ‘మేకప్‌మ్యాన్’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దివాకర్ యడ్ల దర్శకుడు. అభిరామ్ మూవీస్ పతాకంపై కుమార్ మెట్టుపల్లి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రవికుమార్ చౌదరి క్లాప్‌నివ్వగా, సాయివెంకట్ కెమెరా స్విఛాన్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘సినీ రంగంలో మేకప్‌మ్యాన్ పాత్ర కీలకంగా ఉంటుంది. వారి జీవితాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. త్వరలో షూటింగ్ మొదలుపెడతాం’ అన్నారు. ఈ సినిమాకు మంచి కథ కుదిరిందని నిర్మాత కుమార్ మెట్టుపల్లి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటర్: వాసువర్మ, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, సంభాషణలు: ఘటికాచలం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దివాకర్ యడ్ల.