Hanuman Movie | ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రానుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదలకు ఇంకా 9 రోజులో ఉండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్లు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 07న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు సమాచారం. ఇక ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చేతుల మీదుగా హన్మాన్ సెకండ్ ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
MEGASTAR CHIRANJEEVI FOR #HANUMAN pic.twitter.com/HPu9Clbdly
— Aakashavaani (@TheAakashavaani) January 3, 2024
ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ వంటి పలు భాషల్లో హనుమాన్ గ్రాండ్‌గా విడుదల కానుంది.