అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటున్నది. శుక్రవారం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టర్లో అఖిల్ కొత్తలుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ఎంతటి సాహసాలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి కథ : వక్కంతం వంశీ, సంగీతం : హిప్ హాప్ తమీజా, సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్ల.