ప్రవీణ్ కె.వి, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మహీష’. స్క్రీన్‌ప్లే పిక్చర్స్ పతాకంపై ప్రవీణ్ కె.వి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ అందించారు. త్వరలోనే థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు కొండా విజయ్‌కుమార్ టీజర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ సినిమా తీశామని, ‘యధా యధా హి ధర్మస్య’ అనే పేరుతో ఈ సినిమా సీక్వెల్ చేయనున్నామని చిత్ర దర్శకుడు, నటుడు ప్రవీణ్ కె.వి తెలిపారు. ఇంకా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రామకృష్ణ, సంగీత దర్శకుడు శ్రీవెంకట్ కూడా మట్లాడారు. మౌనిక, విజయ్, పి.రమణారెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వివేక్, సతీష్.