SSMB28 Shooting Update | సినీ ఇండస్ట్రీలో కొన్నికాంబోలుంటాయి. ఈ కాంబోలలో సినిమా సెట్టయిందంటే ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రెటీలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో మహేష్‌బాబు- త్రివిక్రమ్ ఒకటి. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు క్లాసిక్స్‌గా మిగిలాయి. టీవీలో వచ్చిన ప్రతిసారి ఈ రెండు చిత్రాలు మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. ఇదిలా ఉంటే ఈ కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటన వచ్చింది. ఇక ఇప్పటికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మహేష్ తన పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఈ సినిమా షూటింగ్ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో ప్రారంభం కానుందట. బస్ ఫైట్ సీక్వెన్స్‌తో ఈ ఎపిసోడ్ ఉండనుందట. ఇప్పటికే ఈ ఫైట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ రామోజీఫిలిం సిటీలో జరుగుతుందట. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.