Maheshbabu-Trivikram Movie First Look Update | మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాల్లో విహరిస్తూ ఫ్యామిలీతో సరదాగ గడుపుతున్నాడు. వెకేషన్ పూర్తి కాగానే మహేష్, త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ కల్ట్ క్లాసిక్స్‌గా మిగిలాయి. ఇప్పటికి ఈ రెండు చిత్రాలు టీవీలో వస్తూ ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు. ఈ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కనుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలైలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో మహేష్ బాబు బర్త్‌డే రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఆగస్టు 12న మహేష్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా&హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు.