సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రంచేస్తున్నాడు. ఈ చిత్రం సోషల్ మేసేజ్ నేపథ్యంలో రూపొందుతుంది.ఇటీవల ఈ సినిమా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సముద్రఖని మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తారని తెలుస్తుంది.
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా ఫైనల్ కాగా, మరో హీరోయిన్గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరో మంచి విజయాన్ని అందుకోని నభాకి ఈ సినిమా ఆఫర్ వస్తే నక్కతోక తొక్కినేట్టే అంటున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది.
మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దాంతో పాటు అల్లు అరవింద్ ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మించే రామాయణంలో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.