టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో మహేష్- నమ్రత ఒకరు. 2000లో విడుదలైన వంశీ సినిమా సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వీరి వైవాహిక జీవితంలో గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా. పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్‌గా అనిపించలేదు. మహేశ్ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు అంటూ నమ్రత ఇటీవల చెప్పుకొచ్చింది.
సర్కారు వారా పాట షూటింగ్ కోసం మహేష్ గోవా వెళ్లగా అతనితో పాటు నమ్రత, గౌతమ్, సితార కూడా వెళ్లారు. అయితే అక్కడ ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవికర్ నమ్రత ఫొటోలు తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ లో అత్యంత అందంగా నమ్రతను ఆయన చూపించాడు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇష్టమైన వారిలో ఒకరు అంటూ ట్వీట్ పెట్టాడు.
మరోవైపు నమ్రత కూడా ఈ ఫొటోని తన ఇన్స్‌స్టా పేజీలో షేర్ చేస్తూ.. ”ఆ రోజు ఏదో సరదాగా మహేష్ జాకెట్ తీసుకుని మేకప్ లేకుండా దిగిన ఈ ఫోటోలను ఇంత బాగా మీరు క్యాప్చర్ చేస్తారని ఊహించలేదు బ్రదర్” అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబు ‘పర్ఫెక్ట్ పిక్’ అంటూ క్యూట్ కామెంట్ చేయగా, దీనిపై లైకుల వర్షం కురుస్తుంది.