Mahesh Babu Look Viral | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. హాలీవుడ్ హీరోలా ఉన్న ఆయన కటౌట్‌ను ప్రస్తుతం అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తెలంగాణ వరద బాధితుల సహాయార్థం (flood victims) నేడు సీఎం రెవంత్ రెడ్డిని కలిసి విరాళం అందించారు మహేశ్ బాబు. భార్య నమ్రతతో కలిసి సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. AMB తరపున మరో రూ.10లక్షలు విరాళంగా ఇచ్చారు.
అయితే సీఎం వద్దకు వెళ్లి చెక్‌ను అందజేసిన టైంలో మహేశ్ ఫొటోలు దిగగా.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మహేష్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం చూస్తుంటే హాలీవుడ్ హీరోను తలపించేలా కనిపిస్తున్నాడు. ఇక బాబు లుక్ చూసిన అభిమానులు హాలీవుడ్ హీరో జాన్ విక్ హీరో (John Wick) కీన్ రీవ్స్ (Keanu Reeves) లా కనిపిస్తున్నాడంటూ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ మెటీరియల్, బాబులకే బాబు, ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
దిగ్గజ దర్శకుడు రాజమౌళితో మహేశ్ బాబు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
Actor Mahesh Babu donated Rs50 lakh to the Chief Minister’s Relief Fund. Also contributed an additional Rs. 10 lakh on behalf of AMB Cinemas pic.twitter.com/mvQZYJHaQ3
— Naveena (@TheNaveena) September 23, 2024