Mahesh Babu | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నేడు 52వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎక్స్ వేదికగా మహేశ్ పోస్ట్ పెడుతూ.. ఒకే ఒక్కడు ఎస్.ఎస్. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్‌లో ఇంకా ఉత్తమమైనది రావాలని ఆశీస్తున్నాను. అద్భుతమైన జన్మదినం జరుపుకోండి సర్ అంటూ మహేశ్ రాసుకోచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం ఒక సినిమా (SSMB29) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ని వచ్చే నెల విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025