Mahesh Babu | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరో ఎవరంటే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు మహేశ్ బాబు (Mahesh Babu). వయస్సు పెరుగుతున్న ఛాయలు ఏ మాత్రం కనిపించకుండా.. సినిమా సినిమాకు యంగ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడీ సూపర్ స్టార్. ఎప్పుడూ ట్రెండీ లుక్‌లో కనిపిస్తూ.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే ప్రిన్స్ ఈ సారి కూడా స్టైలిష్‌గా మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. మహేశ్ బాబు సినిమాలతో వినోదాన్ని అందించడమే కాకుండా.. మరోవైపు సామాజిక కార్యక్రమాలతో ఎప్పుడూ జనాల్లో ఉంటాడని తెలిసిందే.
నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ది వెస్టిన్‌లో నిర్వహించిన Heal-A-Child Foundation eventకు హాజరయ్యాడు. మహేశ్ బాబు ఈవెంట్లో గేమ్ ఛేంజర్స్ కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించాడు. మెరూన్ హుడీ, బ్లూ జీన్స్‌లో లాంగ్ హెయిర్‌స్టైల్‌తో వేదికపైకి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఎప్పుడూ కొత్త లుక్‌తో అదరగొట్టే మహేశ్ బాబు ఈ సారి కూడా సింపుల్ అండ్ స్లైలిష్ లుక్, వాక్‌తో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు. గుంటూరు కారం కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్ ఏరియాలో కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మహేశ్ బాబు మరోవైపు త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 29ను కూడా లాంఛ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
SUPERSTAR MAHESH Annayya In Heal A Child Event! ❤️❤️@urstrulyMahesh #GunturKaaram #MaheshBabu #MaheshBabu𓃵 #SSMB29 #Businessman4K pic.twitter.com/iCjLplLFA3
— Urstrulyreddy🌶️ (@Reddy01232) July 10, 2023
Superstar @urstrulyMahesh graced the Heal-A-Child Coffee Table Book Launch celebrating Game Changers 2023 as the Guest and Brand Ambassador along with #NamrataMaheshGhattamaneni 💫#MaheshBabu #healachild pic.twitter.com/hdRr6vFX8s
— Vamsi Kaka (@vamsikaka) July 10, 2023