Jawan Movie | బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘జవాన్’ (Jawan Movie ). అట్లీ (Atlee) దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో షారుక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది.
తొలి రోజు జవాన్‌కు తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రూ.120 కోట్లు కొల్లగొట్టి షారుక్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించాడు. నార్త్‌లో ఏ స్థాయిలో ఈ సినిమాకు ఆదరణ దక్కుతుందో సౌత్‌లోనూ అదే స్థాయిలో దక్కుతోంది. ముఖ్యంగా తెలుగులో రూ.12 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు పఠాన్ చిత్రం తొలి రోజు రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు తన రికార్డును జవాన్‌తో బద్దలు కొట్టాడు కింగ్ ఖాన్.
జవాన్ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) రివ్యూ ఇచ్చారు. ‘జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా. కింగ్ (షారుక్)తో డైరెక్టర్ అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ను అందించాడు. ఇది షారుక్ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్. ఈ చిత్రంలో షారుక్ కనిపించిన తీరు ఎంతో ప్రత్యేకం. ఆ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. జవాన్‌తో షారూక్ తన గత చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
జవాన్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.
Also Read..
Jawan Movie | జవాన్ బ్లాక్ బస్టర్ అట.. హీరో మహేష్ బాబు రివ్యూ..
Haldi Attack: రిజర్వేషన్ కావాలంటూ.. మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. వీడియో
Python | ఇంట్లోకి దూరిన కొండచిలువను ఈజీగా పట్టేసిన క్రికెటర్.. వీడియో