Mahesh babu | దివంగత ఏఎన్నార్ (Akkineni Nageswararao) శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అక్కినేని నాగేశ్వర్రావు విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిసిందే.
ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాగా.. ఓ స్టిల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu), గ్లోబల్ స్టార్ రాంచరణ్ (Ramcharan) చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రాంచరణ్‌కు మహేశ్ బాబు షేక్ హ్యాండ్ ఇస్తుండగా..మధ్యలో నమ్రతా శిరోద్కర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఎప్పుడో కానీ ఇలా ఒక్క చోట హ్యాపీ మూడ్‌లో కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు మహేశ్ బాబు, రాంచరణ్ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ ఉత్సవాలకు అక్కినేని కుటుంబసభ్యులతోపాటు అగ్రనిర్మాత అల్లు అరవింద్, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, మహేశ్ బాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజు, రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని, కీరవాణితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రాంచరణ్‌కు మహేశ్ బాబు షేక్ హ్యాండ్..
Superstar #MaheshBabu and Mega Powerstar #RamCharan at #ANR100 #Nagarjuna #ANRLivesOn #CelebratingANR100
Their Bonding ❤️.. pic.twitter.com/YwdSdI3cEZ
— Karthik (@karthikm31) September 20, 2023
Superstar #MaheshBabu and Mega Powerstar #RamCharan at #ANR100 Celebrations #ANRLivesOn pic.twitter.com/xRqhJKT44K
— D P V E U (@DPVEU_) September 20, 2023
Superstar #MaheshBabu and Mega Powerstar #RamCharan at #ANR100 Celebrations #ANRLivesOn #MaheshBabu𓃵 #RamCharan #skybroadband #ANRLivesOn #Abhiya #Jawan #MukeshAmbani #ShraddhaKapoor #GanapathAaRahaHai #bbtvi #south #LeoHindiPoster #TigerShroff #INDvsAUS #Canada pic.twitter.com/v8MevNdu4j
— Abhinaw Jat (@iamabhi__45) September 20, 2023