Mahesh Babu | రిస్కు తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు (Mahesh Babu).. ఇప్పుడు అదే చేయాలని ఫిక్స్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈయన నెక్స్ట్ సినిమా రాజమౌళితో ఉందని ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ అలా కాకుండా రాజమౌళి కంటే ముందే మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త విని మహేష్ అభిమానులు సంతోషపడుతున్నారు. మరోవైపు కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. ఇంతకీ రాజమౌళి సినిమా ఉందా లేదంటే మరోసారి వాయిదా పడిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. సినిమా ఖచ్చితంగా ఉంటుంది.. అందులోనూ రాజమౌళి నెక్స్ట్ సినిమా అయితే మహేష్ బాబు తోనే ఉంటుంది.. కాకపోతే మహేష్ బాబు టెక్స్ట్ సినిమా రాజమౌళితో ఉంటుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు కాస్త అనుమానంగా మారింది.
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. అంటే జనవరి నుంచి రాజమౌళి సినిమా మొదలయ్యే వరకు మహేష్ ఖాళీగానే ఉంటాడు. దాంతో ఆ గ్యాప్ లో ఏం చేయాలో తెలియక మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సూపర్ స్టార్. వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించిన ఇదే నిజం. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే కనీసం మూడు నాలుగేళ్లు పడుతుంది. ఎంత లేదన్న 2026 వరకు మహేష్ మళ్ళీ సినిమా చేయడు. అందుకోసమే అంత గ్యాప్ ఇవ్వకుండా ఆ లోపే మరో సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు సూపర్ స్టార్.
దీనికోసమే దర్శకుల వేట కూడా మొదలైంది. ఇందులో అనిల్ రావిపూడి అందరికంటే ముందున్నాడు. గతంలో సరిలేరు నీకెవరు అంటూ మహేష్ బాబుతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఈ దర్శకుడు. దానికి తోడు సినిమాను చాలా తక్కువ టైంలో తీస్తాడు అనే పేరు కూడా ఉంది. పైగా మినిమం గ్యారెంటీ కూడా. అందుకే అనిల్ వైపు అడుగులు వేస్తున్నాడు మహేష్ బాబు. అక్టోబర్ తర్వాత ఈ దర్శకుడు ఖాళీ. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. అన్ని కుదిరితే జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి ఆగస్టు నాటికి విడుదల చేయాలి అనేది దర్శక నిర్మాతల ప్లాన్. నిజానికి డిసెంబర్ నుంచి రాజమౌళి వర్క్ షాప్ మొదలుపెట్టాలి అనుకున్నాడు.. కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా డిస్కషన్స్ నడుస్తుండడంతో ప్రీ ప్రొడక్షన్ కు ఇంకా టైం తీసుకునేలా ఉంది. దాంతో మహేష్ బాబుకు ఫ్రీ టైం ఎక్కువగా దొరికింది. ఆ గ్యాప్ ను అనిల్ రావిపూడి సినిమాతో పూడ్చాలని చూస్తున్నాడు. అలా చేస్తే మరో సినిమా ఎక్కువ చేసినట్టు ఉంటుంది.. గ్యాప్ ఎక్కువగా వచ్చినా ఆ ఫీల్ కూడా ఉండదు. ఒకవేళ ఈ ప్లాన్ వర్కవుట్ అయితే సంక్రాంతి గుంటూరు కారం.. ఆగస్టు నాటికి అనిల్ రావిపూడి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ఊహ వినడానికి చాలా బాగుంది. ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకు అంతకంటే పెద్ద పండుగ ఇంకోటి ఉండదు.