Mahesh Babu Praises Anaganaga | అక్కినేని హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం అనగనగా. ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకత్వం వహించగా.. కాజల్ చౌదరి కథానాయికగా నటించింది. మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాసకొండ, P.V.S రవి, కముడి నేమాని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ETV విన్ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా పిల్లల చదువు, పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత వంటి సున్నితమైన అంశాలను చాలా చక్కగా తెరపై చూపించిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాను తాజాగా చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
అనగనగా చిత్రం ఒక అద్భుతమైన, మనసును హత్తుకునే కథ. ఈ సినిమా మీ సమయాన్ని వెచ్చించడానికి పూర్తిగా అర్హమైనది! సుమంత్, చిత్ర బృందం అందరూ చాలా గొప్ప పని చేశారు. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు చిత్రయూనిట్‌కి నా శుభాకాంక్షలు అంటూ మహేశ్ రాసుకోచ్చాడు.
#Anaganaga is a simple and emotional story told beautifully….👏🏻👏🏻👏🏻 a film that truly deserves your time !
Great work by @ISumanth and the entire team… Sending all my love…♥️♥️♥️@Asunnysanjay @rakeshreddy1224 @pavan_pappula #ChanduRavi @EtvWin @arvindmule_pd…— Mahesh Babu (@urstrulyMahesh) June 25, 2025