Nag Ashwin | ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన తెరకెక్కించిన సినిమా దాదాపు రూ.1250 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా అనంతరం నాగ్ అశ్విన్ కల్కి 2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉండగా.. తాజాగా ఒక ఇంటర్వ్యులో పాల్గోన్న నాగ్ అశ్విన్ కల్కిలోని శ్రీ కృష్ణుడి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కల్కిలో కృష్ణుడి పాత్రకు సంబంధించి టాలీవుడ్లో ఏ హీరోని మీరు ఎంపిక చేయనున్నారు అని ఓ అభిమాని అడుగగా.. నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. కల్కి యూనివర్స్‌లో కృష్ణుడి పాత్రకి సంబంధించి ఆ రోల్ చేసేవారి ముఖం చూపించొద్దు అని ముందే అనుకున్నాం. ఒకవేళ ఆ పాత్రలో మహేశ్ చేస్తే అభిమానులకు పండగే అనుకుంటా. టీజర్ రిలీజ్‌కు ముందే ఆల్‌టైమ్ బ్లాక్ బ్లస్టర్గా నిలుస్తుందని నా నమ్మకం. ఖలేజా సినిమాలో ఆయన పోషించిన పాత్ర కూడా నాకు ఇష్టం అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకోచ్చాడు.