Maheshbabu | సినిమా సినిమాకు యంగ్ లుక్‌లో కనిపిస్తూ.. మూవీ లవర్స్‌ను, అభిమానులను షాక్‌కు గురిచేస్తుంటాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Maheshbabu). పోకిరి సినిమాతో స్టైలిష్ మాస్ లుక్‌తో ట్రెండ్ సెట్ చేసిన ప్రిన్స్.. ఆ తర్వాత ప్రతీ సినిమాకు కొత్తగా మేకోవర్ చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. చాలా మంది సీనియర్ స్టార్ హీరోలకు వయస్సు పెరుగుతుంటే.. మహేశ్ బాబు విషయంలో మాత్రం డిఫరెంట్‌గా రోజు రోజుకీ వయస్సు తగ్గిపోతుందా..? అని ఫొటోలు చూసి చర్చించుకోవడం అభిమానుల వంతవుతుంది.
తాజాగా మరోసారి అలాంటి నయా ట్రెండీ స్టిల్స్‌లో మెరిసిపోతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ప్రిన్స్తాజాగా హాలీవుడ్ స్టార్లకు ఏ మాత్రం తగ్గకుండా కంప్లీట్ మేకోవర్ మార్చేసుకుని కొత్త లుక్‌లో కెమెరాకు ఫోజులిచ్చాడు. రింగుల జుట్టుతో బ్లూ అండ్ బ్లాక్ జీన్స్ కాస్ట్యూమ్స్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని దిగిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. బీటీఎస్ (BTS)అని క్యాప్షన్ ఇచ్చాడు మహేశ్. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేయగా.. మాస్ స్ట్రైక్ వీడియో ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలిచింది.
మరోవైపు ఈ సినిమా పూర్తయిన తర్వాత గ్లోబర్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ఎస్ఎస్ఎంబీ 29పై ఫోకస్ పెట్టనున్నాడు మహేశ్ బాబు. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా సౌతాఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉంది జక్కన్న టీం. ఎస్ఎస్ఎంబీ 29లో మహేశ్‌బాబు తాజా లుక్‌తోనే కనిపించబోతున్నాడా..? ఏంటీ అని చర్చించుకుంటున్నారు కొందరు నెటిజన్లు.
Maheshbabu1
BTS… 😁 pic.twitter.com/MICYoosxwi
— Mahesh Babu (@urstrulyMahesh) June 9, 2023